*అంతేగా.. అంతేగా* ( గల్పికల పోటీకి )

“శుభస్య శీఘ్రం! అయ్యా అన్నీ కుదిరిపోయాయి.. కాబట్టి… వచ్చేనెల ఆరో తారీకు దివ్యమైన  ముహూర్తం ఉంది.”

 “అది ఖాయం చేయమంటారా ”  పురోహితుడు పుండరీకాక్షయ్య పరంధామయ్య వైపు చూశాడు.

అతడు కాబోయే వియ్యంకుడి వైపు చూశాడు.

ఇద్దరూ చిరునవ్వుతో తలలూ పేసి “సరే అలాగే” అన్నారు . 

 వాళ్లు  ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే శరత్ లోపల వైపు తొంగి చూశాడు.  పెళ్లికూతురు  శాంత  మళ్లీ కనిపిస్తుందే మో అని!

.    కర్టెన్ వెనకనుంచి మెల్లిగా తొంగి చూసింది శాంత.

కళ్ళతోనే వెళ్లి వస్తాను అన్నట్టు చూశాడు.

కొద్దిగా తలవంచుకుని చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నట్టు తల ఊపింది.

  వాళ్లు బయటకు వెళ్ళగానే కిటికీ దగ్గరికి పరిగెత్తింది.

     తర్వాత గేటు దగ్గరికి పరిగెత్తి సందు చివరి వరకు వాళ్లు వెళ్లడం చూసింది..

పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది

       **.     **.           **

. “వెళ్ళొస్తాను శాంత “. పెళ్లి హనీమూన్ అన్ని అయిపోయాక ఆఫీసుకు బయలుదేరాడు శరత్.

” అలాగేనండి సాయంత్రం తొందరగా వచ్చేస్తారు కదూ “. శాంత కళ్ళల్లో దిగులు. కన్నీరు ఒకటే తక్కువ.

“ష్యూర్ డార్లింగ్ …”

వరండా మెట్లు దిగిన శరత్ వెనక్కి తిరిగి చూశాడు.

 దిగులుగా ఉన్న శాంత మొహం చూసేసరికి జాలేసింది.

.    మళ్లీ వెనక్కి వచ్చి “తొందరగా వచ్చేస్తాను మరి ఆఫీస్ పని ఉంటుంది. కదా చేసుకోవాలి కదా… నాకు అసలు వెళ్ళ బుద్ధి పుట్టటం లేదు తెలుసా “” అనునయంగా బుగ్గ మీద చిటిక వేశాడు.

“అలాగేనండి ఏంటో మీకు దూరంగా ఉంటే దిగులు.”

 చెమరుస్తున్న కళ్ళని దాచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

.          ****.     *****-******

 “రావయ్యా రా “నీకు మహాలక్ష్మి పుట్టింది” హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్న శరత్ ని  ఆహ్వానించారు పరంధామయ్య.

.    వెలిగిపోతున్న మొహంతో భార్య దగ్గరికి పరిగెత్తాడు శరత్.

***-.       *****       ****

 “శాంతా నేను ఆఫీస్ కి వెళ్ళొస్తా”

 “అలాగేనండి.. చేయి కాళీ లేదు… క్షేమంగా వెళ్లి రండి.” చంటి దానికి డైపర్ మారుస్తూ బెడ్ రూమ్ లోంచి తొంగి చూస్తూ  అంది శాంత.

*****.     ******     *******

 “శాంతా నేను ఆఫీస్ కి వెళ్తున్న”

 “అబ్బా పదిన్నర అయితే ఆఫీసుకి వెళ్ళాలి కదండీ! ప్రత్యేకం చెప్పటం ఎందుకు తలుపు చేరవేస్తే నేనే చూసుకుంటాను కదా!!!

 చంటి వాడి దగ్గరికి  పరిగెడుతున్న కూతుర్ని ఆపలేక దాని ఏడుపు భరించలేక చిరాకు కనిపించకుండా అంది శాంత.

.   

.    .     “నేను ఆఫీస్ కి వెళ్తున్న”

. కాళ్లలో పడుతున్న చంటి వాణ్ణి రెక్క పట్టి లాగుతూ అన్నాడు శరత్..

. అబ్బబ్బ రోజు చెప్పాలా ఏమిటి? మీ  మానాన మీరు… వెళితే నా పనులు నేను చేసుకుని చస్తాను. కూతురికి జడవేస్తూ ఆ జడ లాగటానికి ప్రయత్నిస్తున్న చంటి వాడిని అడ్డుకుంటూ   చికాకు పడింది.

. *.      *.   *

 “శాంతా నేను…”

 “వెళ్లి రండి మహాప్రభో!!! బయలుదేరండి ఆఫీసుకి.”

.    “ఒకంతట వెళ్లరు.

మీ నసుగుడూ మీరూనూ 

 మీరు వెళితే బోలెడు పని ఉంది కొంపలో…”

 గోడమీద అభయ హస్తం తో  సాయిబాబా   అప్పుడూ  ఇప్పుడూ

 అలాగే 

 ప్రసన్నంగా నవ్వుతూ– .

****.     *****.      ***

***