‘ఇవాళ బాగా లేట్ అయిపోయింది’ కానీ సిలబస్ అయిపోయింది’. అది తృప్తిగా ఉంది’
. … వాష్ రూమ్ లో చెయ్యి కడుక్కుని బయటకు వస్తూ గబగబా బ్యాగ్ తీసుకుంది సరోజ.
.
“మేడం ఇంకా టు చాప్టర్స్ నోట్స్ ఇవ్వాలి “అంటూ ఎదురొచ్చారు స్టూడెంట్స్.
.
” రేపు ఆఫీసుకు పంపిస్తాను. వాళ్ళు మీకు కాపీస్ చేసి ఇస్తారు. గుడ్ లక్ బాగా చదవండి. పరీక్షలకు “
అంటూ చకచకా మెట్లు దిగి ఎదురుగా ఆఫీస్ బాయ్ మాట్లాడిపెట్టిన ఆటో ఎక్కేసింది.
***. ****** ****** *******
” నాన్నా..అమ్మ వచ్చేసింది “. సరోజ తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే సంతోషంతో వచ్చి చుట్టుకుపోయారు పిల్లలు.
సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న శేఖర్ ” ఓ అప్పుడే వచ్చేసావా? ” అన్నాడు పొడిగా నవ్వుతూ.
అదేం పట్టించుకోకుండా బ్యాగ్ సోఫాలో పడేసి వాళ్ళిద్దరి తలల మీద ముద్దు పెట్టుకుంది.
“అమ్మా.ఇవాళ మాకు అన్నం కలిపి పెడతావా” అన్నారు.
కొంచెం ఆశ్చర్యపోతూనే “అలాగే” అంది.ఈమధ్య సిలబస్ కంప్లీట్ చేసే హడావిడిలో రోజూ ఆలస్యంగానే వస్తోంది.
.
‘పిల్లలు పాపం నన్ను మిస్ అవుతున్నారు’ అనుకుంది.
డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే ‘మేడం’ అని వినిపించింది.
. గుమ్మం ల్లో స్టూడెంట్ సతీష్. చాలా తెలివైనవాడు కష్టపడతాడు. పొలం తాకట్టు పెట్టి మరి పోటీ పరీక్షల కోసం వచ్చాడు.
” క్షమించండి మేడం. మీ ఇంటికకే వచ్చేసినందుకు.
రేపటి నుంచి పొలం కోతలు ఉన్నాయి, వీలైతే రమ్మని చెప్పారు నాన్న. మీరు నోట్స్ నా చేతికిస్తే కాపీ చేసుకుని లాస్ట్ బస్సు కి వెళ్ళిపోతాను.
మీ నోట్స్ ఆఫీసులో ఇచ్చేస్తాను. “
చాలా మొహమాటంగా ఎంతో ఆశగా అడిగాడు.
“దానిదేముంది సతీష్.కానీ నోట్స్ మాత్రం జాగ్రత్త!”అంటూ లోపలికి వెళ్లి నోట్స్ తెచ్చి సత్యానికి ఇచ్చింది.
అసహనంగా అనుమానంగా చూస్తున్న సతీష్ చూపులు తప్పించుకుంటూ పిల్లలకి అన్నం కలిపి పెట్టింది.
******. ******* ********-
మర్నాడు క్లాస్ బయటకు వచ్చేసరికి ప్రాణ స్నేహితురాలు రేఖ….
“ఓ రేఖ ఎప్పుడొచ్చావ్” అంటూ చేతులు పట్టుకుంది.
“ఇప్పుడే తల్లి ఈ పక్కన మా చుట్టాలు ఇంటికి వచ్చాను, కాసేపు నీతో హస్క్ కొట్టొచ్చు అని ఇక్కడికి వచ్చా.”
“అదేదో ఇంట్లోనే కొడదాం రా! రోజు లేటుగా వెళుతున్నాను. ఇవాళ అనుకోకుండా తొందరగా క్లాస్ అయిపోయింది.
పాపం పిల్లలు నన్ను చాలా మిస్ చేస్తున్నారు”
” సరే పద “
ఇద్దరూ ఆటోలో సరోజ ఇంటికి బయలుదేరారు.
సరోజ వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒకచోట వై జంక్షన్ లాగా ఉంటుంది.
కుడివైపు తిరిగితే లోపలి నుంచి వెళ్ళిపోవచ్చు ఎడం వైపు స్ట్రైట్ గా మెయిన్ రోడ్డు నుంచి వెళ్లొచ్చు.
కరెక్ట్ గా ఆ జంక్షన్ దగ్గర రేఖ గట్టిగా ” సరోజ నీ పతిదేవుడు…. ఆటో ఆపు ఆపు అంది “
కుడి వైపు అడ్డదారి దగ్గర స్కూటర్ ఆపి సిగరెట్ తాగుతూ కూర్చుని ఉన్నాడు శేఖర్..
” అదేంటండీ ఇక్కడ కూర్చున్నారు? మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు” అంది సరోజ ఆశ్చర్యంగా “
“ఆ ఏం లేదు సడన్గా సిగరెట్ తాగాలనిపించింది. అందుకని ఆగాను. పిల్లలు చాక్లెట్లు తెమ్మన్నారు అందుకని బయలుదేరా” అన్నాడు తడబడుతూ.
“సరేనండి మా ఫ్రెండ్ వచ్చింది.నేను ఇంటికి వెళ్తా మీరు వచ్చేయండి” అంటూ ఆటో ఎక్కింది.
సరోజ మొహం కొంచెం కళ తప్పింది.
“రేఖ వ్యంగంగా నవ్వుతూ ఆశ్చర్యంగా అదేమిటే బాబు చెత్తకుప్ప
పక్కన కూర్చుని ఆ కంపులో బండిఆపాడు మీ ఆయన… పైగా సిగరెట్టు కాల్చుకోవటానికి బాగున్నట్టు చెప్తాడు..”
సరోజ ఏమీ మాట్లాడలేదు.
కానీ మనసుకి తెలిసిపోయింది. నిన్న తను ఇంటికి వచ్చిన వెంటనేస్టూడెంట్ సతీష్ వచ్చాడు కదా.
ఆ అబ్బాయి బైక్ మీద లేకపోతే అబ్బాయితో కలిసి ఆటోలో వచ్చాను అనుకున్నట్టున్నాడు.
ఇది కొత్తవి కాదు తనకి.
వాకిలి తలుపు తీయబోతూ లోపలి నుంచి పిల్లల గొంతు విని ఆగింది సరోజ.
అమ్మ ఇవాళ తొందరగా వస్తానంది.
నా హోంవర్క్ అయిపోయింది నీది అయిందా.
అయిందక్క అమ్మ వస్తే ఆడుకోవటమే…. చిన్నదాని గొంతులో సరదా..
కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని దాచుకుంటూ “చిన్నారులూ ” అంటూ లోపలికి అడుగుపెట్టింది.
పిల్లల మొహాలు వెలిగిపోయాయి
అనుకున్నట్టు తల్లి తొందరగా వచ్చేసినందుకు ఆ అమాయకపు మొహాల్లో ఆనందం.
బట్టలు మార్చుకొని వచ్చి”. ఇవాళ నాకు మీకు అన్నం కలిపి పెట్టాలనిపిస్తుంది.అంటూ ఇద్దరికీ అన్నం కలిపి పెట్టింది. “
“మీ రూమ్ లోకి వెళ్లి పడుకోండి అమ్మ” అని హాల్లోకి వచ్చింది.
అప్పటిదాకా ఏదో పత్రిక తిరగేస్తున్న రేఖ పత్రికని టేబుల్ మీద పడేసి సరోజ ముఖంలోకి దీర్ఘంగా చూసింది.
” ఏంటమ్మా.. అలా చూస్తున్నావ్…” ఏమీ తెలియనట్టు అడిగింది సరోజ.
“నువ్వు మా సరోజవేనా అని చూస్తున్నా….
అనవసరంగా ఒక్క మాట పడవు కదా. మీ ఆయన నీ మీద కాపలాగా అక్కడ ఆగాడని నీకు అనిపించలేదూ… ఎడాపెడా వాయించక అలాగా అంటూ వచ్చేసావేమిటి “
“నేనేమంత మూర్ఖురాలిని కాదు రేఖ. ఇలాంటి సంఘటనలు నాకు కొత్తగూడా కాదు…. కానీ నేను ఇప్పుడు కేవలం భార్యను మాత్రమే కాదు.
అమ్మను కూడా!
. ఒకసారి ఇలాగే అనుమానిస్తే బయటికి వెళ్దామని పార్టీకి తీసుకెళ్లి దులిపేశాను. ఆయన ఎదురు సమాధానాలు ఇచ్చాడు.
ఇంటికి వచ్చాక చీటికిమాటికి విసుక్కున్నాడు.
పిల్లల మీద కూడా!! పిల్లలు బిక్క చచ్చిపోయారు.
చిన్నదానికైతే మర్నాడు పక్కలు వెచ్చబడ్డాయి కూడా!
అప్పుడే నేను నిర్ణయించేసుకున్నాను.
నేను పిల్లలకి అమ్మని. బయట పిల్లలకి మేడంని.
మిగతా సమయాలలో “మమ్మీ “ని.
*****. ************* *******