తెలతెలవారుతుండగా పెళ్లి వారి కారు వచ్చి తాటాకు పందిరిఉన్నఇంటి
ముందు ఆగింది.
కార్ లో నుంచి దంపతులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అత్తమామలు కాబోలు వాళ్ళ వెంట నడిచారు.
దిష్టి తీయ డాలు కుడి కాలు ముందు పెట్టడాలు ఇలాంటి ఆచారాలన్నీ ముగిశాక…
అందరూ హాలులో ఉన్న సోఫా లోనూ కుర్చీలో సర్దుకుని కూర్చున్నా రు
“నే నో రెండు గంటలు పడుకుంటాను అంటూ లోపలికి వెళ్ళాడు కొత్త పెళ్ళికొడుకు సురేష్ “
వెళ్లిన మూడు నిమిషాల లోపే కల్పనా అంటూ పిలిచాడు.
కల్పన కు వెంటనే సిగ్గు మొహమాటం ( కొత్తదనం వల్ల కొద్దిగా పులకరింతలు కూడా zసుమా) అనిపించింది.
సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళి ఏంటి అని అడిగింది ,. ఓ చిలిపి చేష్టకి ఎదురుచూస్తూ.:
ఏం లేదు కొంచెం అక్కడ దుప్పటి తీసి నడుముదాకా కప్పు అన్నాడు బద్దకంగా.
ముసి ముసి నవ్వుల చాటున సిగ్గుని దాచుకుంటూ భర్తకు దుప్పటి కప్పి బయటకొచ్చింది
ఆ తర్వాత మూడు సార్లు ఆమె ని లోపలికి పిలిచాడు ఒకసారి మంచినీళ్ల కోసం మరొకసారి పేపర్ కోసం.
భర్త కావాలనే తనను లోపలి పిలిపించుకుంటూ ఉన్నాడని అనుకుంది.
బోలెడు మురిసిపోయింది.
*. *. *
కానీ పెళ్లయిన నెల రోజుల్లోనే కల్పన కి తెలిసిపోయింది భర్త బద్ధకస్తుడు అని.
టూత్ పేస్ట్ దగ్గర్నుంచి ఇవ్వాల్సిందే….. అతడు ఆఫీస్ కి వెళ్లి మళ్లీ ఆఫీస్ నుంచి వచ్చే లోపల బోలెడు పనిచేసినా కంగారు అనిపించేది కాదు.భర్త
ఒకదాని తర్వాత పనులు చెప్పేస్తూ ఉరుకులు పరుగులు పెట్టించే స్తాడు.
ఒకసారి ఏమైందంటే….
పెద్ద వాళ్ళు ఇద్దరు దగ్గర్లోనే ఉన్న చుట్టాలింటికి వెళ్ళారు
కల్పన పక్కనే కూర్చున్నాడు.
జ్వరం తగ్గటంతో కొంచెం నిద్రపోయింది కల్పన.
లేవగానే ఆత్రంగా ఎలా ఉంది అని అడిగాడు సురేష్.
బానే ఉందండి జ్వరం వచ్చినట్లే లేదు అంది నవ్వుతూ.
అమ్మయ్య అని రిలీఫ్గా నిట్టూర్చి… లేచి గుమ్మందాకా వెళ్ళాడు. ఓ రెండు సార్లు అలా తిరిగాక
కల్పన వైపు చూస్తూ.
దగ్గరగా వెళ్ళాడు.
ఆప్యాయంగా తల నిమురుతూ…. లాలనగా
జ్వరం వచ్చింది కదూ!!!
అంటూ..
వెంటనే గబుక్కున “కొంచెం కాఫీ తాగుదామా కల్పనా నాకు కలపటం రాదు తాగాలని ఉంది అన్నాడు.
కల్పన కి ఒక్క నిమిషం అర్ధం కాలేదు అతను అంటున్నది
అర్థం అయిన తర్వాత కొంచెం ఆశ్చర్యం గా లేచి… రెండు కప్పులు కాఫీ తెచ్చి అతనికొకటి ఇచ్చింది.
కాఫీ తాగాక భర్త ఖాళీ కప్పు కోసం చేయిచాచింది.
నీకు నీరసంగా ఉంది వద్దు ఇప్పుడు అమ్మ వస్తుంది కదా తీసేస్తుంది లే అంటూ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టేసాడు.
ఏం మాట్లాడకుండా రెండు కప్పుల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది..
మర్నాటినుంచి షరా మాములే….
*. *. *
మర్నాడు
పొద్దున్న కాఫీ డికాషన్ వేస్తుంటే కల్పనకి సడన్గా జ్ఞాపకం వచ్చింది టూత్ పేస్ట్ అయిపోయింది అని.
సరుకుల అలమారు నుంచి నిండు టూత్ పేస్ట్ తీసుకుని పెరట్లో కి వెళ్ళింది.
సురేష్ టూత్ పేస్ట్ ట్యూబ్ ని అన్నివైపుల గట్టిగా నొక్కు తున్నాడు. ఎలా నొక్కి రాబట్టాడో గాని టూత్ బ్రష్ పొడుగూతా కొంచెం తక్కువగా వేస్ట్ ని పిండేసాడు
కల్పన వైపు కళ్ళు ఎగరవేసి చూస్తూ చిద్విలాసంగా బ్రష్ ని నోట్లో పెట్టుకున్నాడు.
కల్పన నిశ్శబ్దంగా తలవంచుకుని వెళ్ళిపోయింది .