” సరితా రేపే మన ప్రయాణం. జ్ఞాపకo ఉంది కదా
“ఆ…నాకు జ్ఞాపకం ఉంది.కానీ ప్రతి విషయాన్ని నేనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు మాత్రం నెల రోజుల ముందు నుంచి పాట పాడుతూ ఉంటారు మీ అమ్మగారు ఊరు ప్రయాణం గురించి.
” నీకు ఉత్సాహంగా లేదా నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్లి మా ఊర్లో వాలాదామా అని వుంది అన్నాడు రఘు కొంచెం డిసప్పాయింట్ అవుతూ..
అబ్బే అలాంటిదేమీ లేదండి వెళ్దాం.మీరు ఆఫీస్ కి వెళ్లి రండి అంది నవ్వుతూ.
సరితా రఘు ఇద్దరు డాక్టర్లు.పెళ్లయి రెండేళ్లు lఅవుతోంది.
రఘు పుట్టి పెరిగిన ఊరు పక్కా పల్లెటూరు. రఘు తల్లి ప్రతి చిన్న ఆచారాన్ని నమ్మకాన్ని పాటించే వ్యక్తి.
సరిత పుట్టిందీ పెరిగింది ఢిల్లీలోనే.
పోయిన ఏడాది సంక్రాంతి కి వెళ్లినప్పుడు గొబ్బెమ్మలు పెట్టడం అంటే చాలా అసహ్యం అనిపించింది సరితకి.
కొత్త కోడలి చేత గొబ్బెమ్మలు పెట్టించి గౌరీదేవి కృప పొందాలని రఘు తల్లి నమ్మకం.
మొదటి ఏడు మొత్తం మీద ఇటు చేసి అటు చేసి గొబ్బెమ్మలు పెట్టటం తప్పించుకుంది.
పోయినసారి అలా అయింది గానీ ఈ సారి ఏం చేయాలో తోచట్లేదు సరితకి.
రఘు కూడా తల్లి పక్షమే!!!
అత్తగారి ఊరు వెళ్ళటం అంటే సరిత కు కూడా ఇష్టమే… ఆవిడ అమాయకత్వం, ఆప్యాయత..
ఆవిడ చేసే రకరకాల పిండివంటలు ఇవన్నీ నచ్చుతాయి.
కానీ…
ఈ గోబ్బె మ్మల…. తతంగం
అందుకే సంక్రాంతికి అత్తగారి ఊరు వెళ్లడమంటే ఒకలాంటి ఉదాసీనత.
* * *
మర్నాడు రఘు ఉత్సాహం చూసి తాను కూడా తెల్లవారుజామునే లేచి తయారైయింది.
వేరే ఊరు అనే పేరేగాని అత్తగారి ఊరికి కరెక్ట్ గా రెండు గంటల ప్రయాణం కారులో..
పొద్దున్నే 5 గంటలకి కారు దిగుతున్న దంపతులను చూసి ఇంటిల్లిపాది వాకిట్లోకి వచ్చేశారు.
అన్నయ్య,అక్క బావ వదిన అంటూ రకరకాల పిలుపులతో.,
అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.లోపలికి వెళ్లారు.
” హమ్మయ్య ఇందులో ఆడపిల్లలుఅయిదారుగురు ఉన్నారు.
“వాళ్ళు పెడతారు లే'” గొబ్బెమ్మలు అనుకుంటూ వంటింట్లోకి అడుగు పెట్టింది.
వీళ్ళ కోసం ఫ్రెష్ గా కాఫీ కలుపుతూ అత్తగారు “
” అమ్మయ్య! వచ్చేసావా తల్లీ కాఫీ తాగి కొత్త చీర కట్టుకుని మొదటి గొబ్బెమ్మ నువ్వే చెయ్యి.అన్నారు.”
హబ్బ… అని మనసులో అనిపించినా ముందు..
పల్లెటూరి ఫిల్టర్ కాఫీ.
ఆస్వాదిస్తూ ఉండిపోయింది సరిత.
పిల్లల అరుపులు నవ్వులు..లతో వచ్చి .
నేనంటే నేను అంటూ చేతులు పట్టుకుని సరితను పెరట్లోకి లాక్కుపోయారు.
పెరట్లోకి అడుగుపెట్టిన సరిత గతుక్కుమంది.
ఎదురుగా చిన్న సైజు కొండంత పేడ
దానికి ఎదురుగా కూర్చోటా నికి పీట
మట్టు గిన్నెలలో పసుపు కుంకుమ
పక్కనే బుట్టలో గుమ్మడి పూలు.
పట్టణాల్లో పెరిగిన సరిత గొబ్బెమ్మలు ఎలా చేస్తుందో ఒకవేళ రాకపోతే తామే నేర్పించాలని ఎవరికి వారు మాట్లాడుతూ చుట్టూత కూర్చున్నారు
వీటికి పక్కనే చిన్న మంచం మీద చంటి పిల్లాడిని ఒళ్ళో వేసుకుని కూర్చుంది చిన్న ఆడపడుచు.
పల్లెటూరి అమ్మాయ కత్వం lతో, పట్నం వదినకి నేర్పించాలని ఆతృతతో
“చూడండి వదినా…ఇలా తీసుకోవాలి” అంటూ ఒడిలో పిల్లాడున్నాడనే సంగతి మర్చిపోయి ముందుకి వంగింది.
పేరుకిపెళ్లయ్యింది
ఏడాదిలోపల ఒడి పిల్లడు. వచ్చేసాడు కానీ పాపమా పిల్లలకి 17 ఏళ్ళు ఉంటాయేమో మహా అయితే
ఆ పిల్ల ఒడిలో ఉన్న రెండు నెలల పిల్ల వాడు కాస్తా పేడ కుప్పలో బోర్లా పడిపోయాడు.
సరిత వెంటనే చురుగ్గా కదిలింది.
పిల్లవాడు పేడ కుప్పమీద పడీ పడగానే
చంకలో నుంచి పిల్లవాడి భుజాన్ని పట్టుకుని గబుక్కున పైకి తీసింది
చేతి మీద బోర్లా వేసుకుని మొహం తుడిచేసి మెల్లిగా
పొట్ట చేతికి తగిలేట్టు మెల్లిగా వీపు మీద తడుతూ…
ఉండగానే అత్తగారు బకెట్ నిండా వేడి నీళ్లు తెచ్చారు.
చంటి పిల్లవాడిని ఇవ్వమ న్నట్టు చేయి చాపారు
సరిత పిల్లవాణ్ణి ఇచేసి ఒకసారి తనని తాను చూసుకుంది.
చేతులు మీద చీర మీద మీద అంతా పేడే!!
అబ్బా వదిన బాబుని ఎంత ఒడుపు గా పట్టుకున్నావు.
అవునూ….
నీకు పేడ అంటే అసహ్యం కదా మరి పేడ లో ఉన్న బాబు ని ఎలాపట్టుకున్నావ్…
అదే అమాయకత్వం ఆడబడుచు మాటల్లో
మీ వదిన పెద్ద గైనకాలజిస్ట్. ప్రాణం కాపాడటం మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండదు అన్నాడు రఘు. పెరట్లోకి వస్తూ
ఆడపడుచు ప్రశ్న కి ఉలిక్కి పడి ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లి పోయింది.
కానీ రఘు మాటలు మనసులో గింగురు మంటున్నాయి.
అవును తనకి ఎందుకు బాబు చుట్టూ ఉన్న పేడ జ్ఞాపకం రాలేదు.?
అసహ్యం వెయ్యలేదు.???
ఎందుకు.. ఎందుకు…. ఎందుకు…..
వేడిగా కాఫీ తాగాలి అనుకునే లోపలే
పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసుతో ఎదురొచ్చారు అత్తగారు.
కాఫీ గ్లాసు విచ్చేసి సరిత బుగ్గలు పుణికి వెళ్ళిపోయారు. సరితకి ఆవిడ కళ్ళలో చిన్న చెమ్మ కనిపించిoది.
ఒక అరగంట పడుకుని లేచే సరికి ఫ్రెష్ గా అనిపించింది సరితకి
తన ప్రశ్నకి జవాబు కూడా దొరికింది.
తను చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలనే అనుకుంది.
ఉమెన్స్ డే రోజు ర
అమ్మతో కలిసి వాళ్ళ మహిళా మండలి లో అమ్మ గురించి కవితలు విన్న పుడు గైనకాలజిస్ట్ అవ్వాలని అనుకుంది.
ఇష్టంగా చదవటం వల్ల ఎండి లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించుకుంది
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో క్లిష్టమైన కేసుల్ని చేసింది.
అంటే చిన్నప్పటి నుంచి తను సరిత గాక ఎక్కువ డాక్టర్‌గా పెరిగింది అని అర్ధమైపోయింది.
అందుకే ఆ బాబు నీ బిడ్డని తీసినప్పుడు…. బాబు నీ రక్షించాలి అని ఒక డాక్టర్ పడే తపన తనలో ఉంది.
దాని ముందు అన్ని బలాదూర్ అయిపోయాయి
తను అంతకు ముందు పేడ తో గొబ్బెమ్మలు చెయ్యటానికి
వెనుకాడింది దాని విలువ తనకి తెలియక పోవడం వల్లే!!
ఇష్టమైన పని చేస్తూ ఉంటే కష్టం తోచదు అంటారు పెద్దలు .
. తను డాక్టర్ గానే ఢిల్లీలో పెరగటం వల్ల మన ఆచారవ్యవహారాలు
వాటి విలువలు తెలీదు
ఒక విజ్ఞానాన్ని సంపాదించుకునే ఆతురత లో దేశీయ జ్ఞానాన్ని తెలుసుకోలేక పోయింది.
అసలు అది విజ్ఞానమని తెలిస్తే గా
పైగా పల్లెటూరు వాళ్ళ అంటే ఒక రకమైన చిన్నచూపు.
ఆచారవ్యవహారాలు చా దస్తాలు అని నిరసన.
” అమ్మా…వీడికి పొట్ట మీద నల్ల మచ్చలు ఉండేవి అవి లేవు.చూడు”
ఆడబడుచు సంతోషంగా కొడుకుని ఎత్తుకొని వచ్చి చూపింది.
నిన్న పేడ లో నానాడు కదా అందుకే ఏమో…. మనవడి
వీపు మీద మురిపెంగా తడుతూ అంది.
పండగ హడావిడి తగ్గాక మన ఆచారాల గురించి తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
నెమ్మదిగా నిట్టూర్చింది
బయట వసారాలో కొచ్చేసరికి పిల్లలందరూ చక్కగా పూల జడలు వేసుకుని.
పట్టు లంగాలు కట్టుకొని హడావిడిగా ఉన్నారు.
“” వదిన నువ్వు కూడా సందె గొబ్బెమ్మ పేరంటానికి వస్తావా అని అడిగింది చిన్న ఆడపడుచు.
అబ్బా ఈ పండక్కి పెద్దవాళ్ళు రారు. చిన్నపిల్లలే పాటలు పాడుకుంటూ చేసుకుంటాం
అబ్బా…. మేము రాము కానీ మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి.అందరము కబుర్లు చెప్పుకుంటూ ఏవైనా ఆడుకుందాం. సందె
గొబ్బెమ్మ అంటే ఏమిటో అప్పుడు నాకు నువ్వు చెప్పు .
పిల్లలందరూ పొలోమని పోయారు పేరంటానికి
రంగు రంగుల పక్షులు ఎగురుతున్నట్టు అనిపించింది సరితకి
మరు నాడు….
తెల్లవారుజామున పెరట్లోకి వచ్చిన పెద్దావిడ
ఎదురుగా దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
లోగిలి నిండా అందమైన ముగ్గులు.
వాకిలి కి ఎదురుగా స్వర్గ ద్వారాల ముగ్గు.
ఒకవైపు నెమళ్ళ జెంట మరొకవైపు చిలుకల జంట.
వాటికి తగ్గట్టు రంగులు.
అన్నిటి నిండా అందంగా గొబ్బెమ్మలు పరుస్తున్న కోడలు,పిల్లలు
గౌరీ దేవి స్వయంగా వచ్చి తన ఇంటి వెనక కలయ తిరుగుతున్నట్లు అనిపించింది ఆవిడకి.
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.