*’అర్ధాం’గి*   ( గల్పికల పోటీకి )

వేసవికాలం  ఉదయం ఆరు గంటలవుతోంది.

 చల్లగా.. హాయిగా ఉంది.

ఇంటి ముందున్నలాన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నారు  శారద, సతీష్,

వారి ఒకగా నొక్క కూతురు సరిత.

.   కాఫీ తాగుతూనే మొబైల్ చూస్తున్న సరిత “వావ్ ఐ లైక్ దిస్ భలే ఉంది “అని చిన్న కేక లాంటిది వేసింది.

” ఏమిటది అంత బాగున్నది ” కుతూహలంగా అడిగింది శారద.

 “అమ్మ ఇవాళ కామేశ్వరి పిన్ని  నలభయ్యవ పుట్టినరోజుట కదా!”

.  

. బాబాయ్  సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడుట. ఒక పట్టు చీర..

ఒక పార్టీ వేర్..

రెండూ బ్రహ్మాండంగా ఉన్నాయి.”

 కూతురి మాటతో తనూ ఫోన్ తీసుకుని చూసింది.

.  నిజమే చాలా చాలా బాగున్నాయి. వినోద్,  కామేశ్వరి కూడా ఉన్నారు ఫోటోలో.

 మరిది మొహం లో ఎందుకో కించి త్ గర్వరేఖ కనిపించింది. అలాగే తోటి కోడలు   కామేశ్వరి  నవ్వుతున్న మొహంలో ఒక చిన్న భిన్నమైన ఫీలింగ్….

 “చూడండి బాగున్నాయి కదూ “భర్తకు చూపించింది.

 “ఓ బాగున్నాయి బాగున్నాయి “సరిగా చూడకుండానే పేపర్ చదువుతూ ఉండిపోయాడు సతీష్..

 ‘ఈయ నో మా లోకం’

 నవ్వుతూనే అనుకుంది శారద.

 ***.      ***** ****** ****

 “సరితా..!ఇవాళ నువ్వు కాలేజీ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండనేమో!!” కామేశ్వరి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా…”

 మొన్న పుట్టినరోజుకి వెళ్లలేకపోయాం కదా!

.  “ఓ…. నేను  కాలేజీ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. పుట్టినరోజు సర్ప్రైజ్ కి నేను ప్రత్యేకంగా అభినందిస్తా పిన్నిని.ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం.”

 “సరే అలాగే తొందరగా వచ్చేయ్”

*****.     ****.      ******

 కాలింగ్ బెల్ మోగింది..

. ” నేను చూస్తానులే అక్క” అంటూ వెళ్లి తలుపు తీసింది.

.   “వావ్ పిన్నీ….

 హౌ ఆర్యూ …” అంటూ కామేశ్వరుని చుట్టేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సరిత.

“ఆగవే పిల్ల ఆగు పడిపోతాను” అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది.

 “ఏమిటి ఈ హడావిడి” అంది నవ్వుతూ.”

“యు ఆర్ సో లక్కీ పిన్ని! హౌ రొమాంటిక్ బాబాయ్ ఈజ్ ” అంటూ మరోసారి చుట్టేసింది..

” దీంతో ఏది వచ్చినా  ఇంతే!” ప్లేట్ నిండా పకోడీలు తెచ్చి ఇస్తూ అంది శారద.

 “వావ్ పకోడీలా “అంటూ తల్లి చేతిలో ని ప్లేటు లాక్కుని “నేను లోపల టీవీ చూస్తూ తింటా” అంటూ వెళ్లిపోయింది.

.  

. “నిజమే కామూ”మరిది గారు మంచి సరసుడే!! నాకు కూడా చాలా థ్రిల్లింగా అనిపించింది.”..

. తోడికోడలు చేతికి ఒక ప్లేట్ పకోడీ ఇచ్చి తనూ తింటూ అంది  శారద.

.  

“నువ్వు అదృష్టవంతురాలివి.”

 “అవును కాబోలు….” దీర్ఘంగా నిస్టూ రుస్తూ కొనసాగించింది.. ఆశ్చర్యంగా చూస్తున్న  ..

 శారద వేపు చూస్తూ….

.    “పుట్టినరోజు చీరలు సరే సర్ప్రైజ్.. బానే ఉంది.

 కానీ ఆయనకి నన్ను సర్ప్రైజ్ చేయడం ఒక హాబీ… కాదు కాదు ఆ రూపంగా తనకు నచ్చినవే నేను నచ్చుకోవాలి అనే భావం.

 ఇదిగో ఈ సోఫా సెట్ చూసావా… చాలా ఖరీదైంది.

.     మొన్నామధ్య  మేము ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు చూసి చాలా చాలా బాగుంది అనుకున్నాం.

.   అంతే!!!నాలుగు రోజుల తర్వాత ‘సర్ప్రైజ్ ‘అంటూ సెట్  తెచ్చి ఇంట్లో పెట్టారు.

 నిజానికి మేము చూసిన సోఫా సెట్టులో కుషన్ చిన్నచిన్న డిజైన్తో చాలా ముద్దుగా ఉంది.

 నాకు అది అలాగే నచ్చింది.

 కానీ ఈయనకి ప్లేన్ క్లాత్ ఇష్టం. అందుకని వెళ్లి కొనుక్కొచ్చేసారు.

 సోఫా ని దులిపేది, రోజు ఎక్కువసేపు చూసేది.. కూర్చునేది నేనే..

 నన్ను ఒక్క మాట అడిగి ఉంటే బాగుండేది కదా అనిపించింది!!”

 “ఇదే కాదు అక్కా… ఇంటికి కొనే ఏ వస్తువైనా, ఎంత ఖరీదు అయినది అయినా    నన్ను ఒక్క మాట అడగరు, నాకసలు చెప్పరు.”

 నాకేమో..

 “నన్ను కూడా అడగొచ్చు కదా!

 ” నాతో ఒక మాట చెప్పొచ్చు కదా! “! అనిపిస్తుంది…

 గొంతులో నిస్పృహని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తూ అంది కామేశ్వరి.

 ఆమె మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా చూస్తూ ఉండిపోయింది శారద.

 ఇంతలో కామేశ్వరి ఫోన్ మోగింది….

అప్రయత్నం గా ఆన్ బటన్ తో పాటు  స్పీకర్ నొక్కింది.

 ” హాయ్ కామూ నీ కో సర్ప్రైజ్!! కింద బాల్కనీలోకి  రా… మరిది వినోద్గొంతుని గుర్తుపట్టింది శారద.

 “అబ్బో ఏం తెచ్చారో??

అనుకుంటూ “నువ్వు రా అక్కా ” అంటూ శారద  చేయి పట్టుకుంది.

.   కింద సెల్లార్ లోకి వచ్చేసరికి ”  లేటెస్ట్ మోడల్ కారు… ఎర్రని ఎరుపు రంగుది..

ఎండ పడి మెరుస్తూ ఉంటే…. డ్రైవ్ చేస్తూ నవ్వుతూ లోపలికి వచ్చాడు మరిది.

 కార్లలో ఎరుపు రంగు అంటే కామేశ్వరికి ఇష్టం లేదు.

కించిత్ భయం కూడా!

 బిత్తర పోయిన శారదను చూసి జీవం లేని నవ్వునవ్వింది.  కామేశ్వరి.

 క్షణంలో..

మొహమంతా నవ్వు పులుము కొని భర్తకి ఎదురెళ్ళింది.