మంచి నిద్రలో ఉన్న ఈశ్వరికి సడన్గా మెలకువ వచ్చింది. బద్ధకంగా టైం చూసుకుంది.
నాలుగున్నర తెల్లవారుజాము.
. ఎండాకాలం ‘తెల్లవారుజామున హాయిగా ఉంటుంది పెరట్లో కూర్చుందాము’ అనుకుని లేచి, వంటింటి దాకా వచ్చింది
. ఎదురుగా అన్నం తినే బల్ల చూసి ఒక్కసారిగా “పిన్నీ” అంటూ కేక పెట్టింది.
మెలకువ వచ్చి నా పక్క మీద అటు ఇటు తిరుగుతూ ఉన్న కాంతమ్మ, ఈశ్వరి కేకకి ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చింది.
” ఉష్…ఉష్.. ఉండు అందరూ లేస్తారు ఏమైంది” అంటూ బల్లని చూసి గతుక్కుమంది.
. ఈశ్వరి ప్రాణప్రదంగా చూసుకునే వెదురుతో చూసిన తమలపాకుల బుట్ట.
చింపి ముక్కలు ముక్కలై చిందరవందరగా పడి ఉంది.
. ‘అయ్యో రాత్రి పెరట్లో ఎలకలకి తిండి పెట్టలేదు నేను…. అందుకే ఈ రచ్చ’ అనుకుంటూ భయంగా బాధగా ఈశ్వరి వేపు చూసింది.
. ఈశ్వరి కళ్ళ నుంచి రోషన్తో బాధతో నీళ్లు ప్రవాహం కడుతున్నాయి. తనకు ఎంతో ప్రాణ స్నేహితురాలు ఇచ్చిన బుట్ట అది.
. వెదురుతో చేసిందైనా దానిమీద తాంబూలానికి అవసరమైన సువాసన దినుసులన్నీ అతికించి, ఎంతో కొత్తగా గా అందంగా చేసిన బుట్ట అది.
. ముందు రోజు బాబాయ్ గారి పై ఆఫీసర్ వస్తున్నారు అంటే, పిన్ని బతిమిలాడితే తీసి ఇచ్చింది. అయినా ఇన్నాళ్లు లేనిది ఇవాళ ఏమిటి బీభత్సం… అనుకుంటూ ఉండంగానే పిన్ని మాటలు వినిపించాయి.
. “ఎలకలలా….ఆహారమా…. ఏంటి పిన్ని నువ్వు అంటున్నావు ” వీలైనంత అసహ్యంగా మొహం పెట్టి అడిగింది.
. ‘”అదా… ముందు బ్రష్ చేసుకురామ్మా.. కాఫీ తాగుతూ మాట్లాడకుందాం. నా తల్లివి కదూ..ఎలాగోలాగా మళ్ళీ ఆ బుట్ట తెప్పించుకుందాం లే….. నీ ప్రాణ స్నేహితురాలు చేసినట్టే నేను చేసి పెడతాను.
. “నా బుజ్జివి కదా పదమ్మా “
అంటూ బ్రతిమిలాడింది.
. తన కన్నా పెద్దది,ఎంతో ఆప్యాయంగా చూసుకునే పిన్ని బతిమిలాడుతుంటే కాదన లేకపోయింది ఈశ్వరి.
****. *****. ****
మొహం కడుక్కుని పెరట్లో కూర్చున్న ఈశ్వరి కి ఒక గ్లాసుడు వేడివేడి కాఫి ఇచ్చి తను ఒక గ్లాసు పట్టుకుని కూర్చుంది కాంతమ్మ.
. “ఇది పల్లెటూరు కదమ్మా చుట్టుపక్కల అందరి ఇళ్లల్లోనూ ఎలుకలు తప్పవు.
నాకు పెళ్లయి వచ్చిన కొత్తల్లో వీటితో నానా అవస్థ పడ్డాను.
అసలే కొత్త సంసారం అందులోనూ ఉమ్మడి కుటుంబం.
పొరపాటున ఏ ఒక్కటి మర్చిపోయినా ఎలకలు బీభత్సం చేసేవి.
వాటి బాధ వదిలించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసాం.
. మొదట్లో బోను పెట్టాను. బోనులో పట్టుబడ్డ ఎలకని ఎంత దూరం వదిలి వచ్చినా మళ్లీ వచ్చేసేది.
‘ఇలా కాదులే ‘ అనుకుని పిల్లి ని పెంచాం.
అదీ జీవే కదా కడుపుతో ఉండి పిల్లల్ని పెట్టింది.
. ఆ పిల్లల ఏడుపు చంటి పిల్లల ఏడుపులా ఉండటం…. పిల్లి దగ్గరికి వెళితే గుర్రు గా చూడటం…
పిల్లల్ని రోజుకోచోట మార్చటం ఎందుకు అడుగుతావులే ఇల్లంతా నానా గందరగోళం అయింది.
ఇలా అష్ట కష్టాలు పడుతున్న రోజుల్లో మరిది గారి పెళ్లయింది…. వడియాలు ఇంట్లోనే పెట్టుకుందాం, అని నాలుగైదు మంచాల మీద వడియాలు పెట్టాం.
అవి ఎండాక తీసి ఇంట్లో పెట్టటంలో ఒక బుట్ట మర్చిపోయాం.
. మర్నాడు లేచేసరికి వంటి ల్లంతా హాయిగా ఉంది.
ఎలకలు వచ్చిన జాడే లేదు…
ఏమిటా ఇంత అదృష్టం అనుకుని పెరట్లోకి చూస్తే ఆ వడియాలన్నింటినీ ఎలకలు పీకి
పాకం పట్టి వెళ్లిపోయినట్లు ఉన్నాయి.
అప్పటినుంచి పెరట్లో గట్టుమీద ఏవో కొన్ని తిను బండారాలను
ఎలకల కోసం పెట్టడం అలవాటైపోయింది.
. పొద్దున లేచి ఆ గట్టు కడుక్కుంటే సరిపోయేది.
. హావభావాలతో కాంతమ్మ పిన్ని చెప్పింది వింటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు ఈశ్వరికి.
. “అయినా ఎలకలని పెంచుకోవడం ఏమిటండీ” గొంతులోనూ మొహల్లోనూ అసహ్యం అంతా ఒలికిస్తూ అంది ఈశ్వరి.
“అదేమిటి అలా అంటున్నావ్”
“లేకపోతే ఏమిటి పిన్ని వాటిని చూస్తేనే అబ్బా…యాక్..అసహ్యం. సుబ్బరంగా ఎలకల మందు నాలుగు రోజులు వరుసగా పెడితే భయపడి, రావు. అంతేగాని వాటిని రోజు మన ఇంటికి రమ్మని పిలుస్తూ ఆహారం పెట్టడం ఏమిటి నా బొందా ?!”
” అదేమిటమ్మ అంత అసహ్యం ఏమిటి?… అవి ప్రాణులేగా!
. .. మా చిన్నప్పుడైతే కుక్కల్ని చాలా హీనంగా చూసేవారు. వీధిలో వాటి మా నాన అవి తిరిగినా చిన్న పిల్లలు రాళ్లతో కొట్టేవారు.
నేను బిఏ మొదటి సంవత్సరం అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు అనుకుంటా…
మా మేనమామ పెద్ద ఆఫీసరు అయ్యారు. ఆయన భార్య అరువేలు పోసి రెండు కుక్కల్ని కొనుక్కుంది అని…అందరూ వింతగా చెప్పుకున్నారు. “
. ఇప్పుడు వాటి విలువ తెలుస్తోంది కాబట్టి కొంతమంది పెంచుకుంటున్నారు కొంతమంది ఆదరిస్తున్నారు. వాటికి రాజభోగాలు చేసేవారు లేకపోలేదు.
. చిలకలు, పిల్లులు కుందేలు వీటిని పెంచుకుంటున్న వాళ్లు లేకపోలేదు..
నిజానికి ప్రతి జీవికి ఏదో ప్రయోజనం ఉంటుంది. దాని ఆహారాన్ని వెతుక్కునే మార్గాన్ని భగవంతుడే దానికి ఇస్తాడు.
మనం నిమిత్తమాత్రులం.. “
ఈశ్వరి కి రోషం పొడుచుకొచ్చింది.
“ఈ ఎలకల ప్రయోజనం ఏమిటో! ఇంటినంతా చిందర వందర చేయటమా!” వ్యంగ్యంగా అంది.
” నేను ఎక్కువగా చదువుకోలేదమ్మా! కానీ మీ బాబాయితో అప్పుడప్పుడు న్యూస్ వింటూ/ చూస్తూ ఉంటాను.
. కొన్ని కొన్ని మందులు కనిపెట్టినప్పుడు ‘ఎలకల మీద చేసిన ప్రయోగం విజయవంతమైంది ‘అని చెప్పేవారు.
మీ బాబాయిని అడిగితే ఎలకల మీద ప్రయోగం చేస్తారని ఆ ప్రయోజనాన్ని బట్టి మానవులకు ఉపయోగపడే మందులు తయారు చేస్తుంటారని చెప్పారు. “
.
ఈశ్వరి తెల్లబోయి చూస్తూ ఉంటే ” నాకు ఇంకా బోలెడు పని ఉందమ్మా “. అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
“…… ఆ బ్రహ్మ కీట జననీ… సందు చివర ఉన్న దేవాలయంలో నుంచి లలితా సహస్రనామం వినపడింది.