చెప్పవే మరి నువ్వు ఇలాగే నానుస్తూ ఉంటే నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్. చెప్పు 30 రూపాయలు ఇస్తాను మరి అంటున్నారు జగదాంబ గారు.
జీతం సరేనమ్మా ముందు అన్నం ఎంత పెడతారో చెప్పండి . పక్క వీధిలో అమ్మగారుఅమెరికా వెళ్లిపోవడం వల్ల ఒకి ల్లు పోయింది.మరి ఇంకొక ఇల్లు కావాలి కదా అందుకని వచ్చాను.
“దయగల తల్లి గిన్నెడు అన్నం పెట్టేది”
సర్లే ఆ తప్పాలా గిన్నె చూసావా దాన్నిండా అన్నం ఇస్తాను.
పెరట్లోగిన్నెలుఎండిపోతాయి. పద… మరి….
నర్సి మొహాలో ఆనందం ఆనందం తొంగి చూసింది.
మరి ఆ అన్నం లోకి ఏదైనా మెల్లిగా గొనుగుతున్నట్టు అంటూ పెరట్లోకి దారితీసింది.
సర్లేవే బుద్ధున్నవాళ్ళు ఎవరైనా ఒట్టి అన్నం పెడతారా.
ఇంత కూరో, పప్పులుసో పోస్తాను లే.
7 ఎండ కొంచెం చురుగ్గా మొహం మీద పడటంతో ఉలిక్కిపడి నిద్రలేచింది మానస.
టైమెంతయిందో…
.
8 దాటిపోతే పనిమనిషి మరి రాదు. టైం చూసింది
పావు తక్కువ 8
ఒక్క ఉరుకులో లో హాల్ లోకి వెళ్లి తలుపు తీసింది.
అప్పుడే మూడు మెట్లు దిగి వెళ్లిపో తూ కనిపించింది పనిమనిషి శ్రీలత.
పిలిచిన రెండు మూడు నిమిషాల తరువాత వెనక్కి తిరిగి
వస్తున్నాఅమ్మా తలుపు తెరవలేదు కదా అని వెళ్ళిపోతున్నా
లేదులే రా తల్లీ.నిన్న కూడా పనిలోకి రాలేదు కదా
“పని చేసుకుని వెళ్ళు” అంది శ్రీలత మనసులోని కరకు తనం గొంతులో కనిపించనీయకుండా జాగ్రత్తపడుతూ
“రా లేదంటే మరి పని పడింది అండి.
అంటూ లోపలికి వెళ్ళి చీపురు తీసుకుని ఇల్లు ఊడు స్తూ..
కూతురు స్కూల్లో ఫంక్షన్ గురించి ఏదో…
చెప్తూనే ఉంది
అంట్లుతోమ టానికి వంటింట్లోకి వెళుతున్న శ్రీలతతో మానస చెప్పింది
“చూడు నిన్న మా ఇంట్లో పార్టీ అయింది. చాలా కాస్ట్లీ గా చేశాను పలావ్. చాలా బాగా వచ్చింది అన్నారు.
. మీ నలుగురికీ సరిపోయేంత అక్కడ కుక్కర్ లో పెట్టాను చూడు తీసుకెళ్ళు….
. వాట్స్అప్ కాంటాక్ట్స్ లో మెసేజ్ లు అన్నీ చూసి రిప్లై ఇచ్చేసి ..
జవాబులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి
పని మనిషి ని పర్యవేక్షించటానికి వంటింట్లోకి వెళ్లిoది మానస
కుక్కర్ గిన్నెలో ఉన్న పలావు ని చెత్తబుట్టలో వేస్తోoది .
అదేంటి శ్రీలతా అంత మంచి అన్నాన్ని పారేస్తున్నావు
అంది. మానస.
“క్షమించండి అమ్మా నేను గానీ, మా పిల్లలు గానీ చద్ది అన్నం తినమ్.”
అయ్యో మరి సద్ధి కాదే….. నిన్న రాత్రే…. ఈ పూట మేము కూడా…
మానస మాటలు పూర్తి అవకుండానే
“ఎల్తానమ్మ..”.అంటూ
వెళ్లి పోయింది.
. మానస చూపు చెత్త బుట్ట మీదనించి మరల లేదు.
. నెయ్యి కిస్మిస్ కాజు బాగా ద ట్టించిందేమో…
లేత పసుపురంగులో కంటికింపుగా. ఘుమ ఘుమ లా డుతోంది….
. పక్కిటి మామి గొంతుశ్రావ్యం గ వినిపిస్తోంది.
భిక్షాందేహి కృపావలంబనకరీ
మాతా…అన్నపూర్ణేశ్వరీ