జనవరి మాసం
సంక్రాంతి దాటిపోయిన ఇంకా చలి తగ్గలేదు….. సంక్రాంతి దాటిందేమో చలి ఉండి ఉండనట్టు వింత వాతావరణం.
అందమైన ఆ ఇంటి ముందు ఉన్న లాన్లో ఏదో పార్టీ జరిగినట్లు…
బల్లల మీద తిని వదిలేసిన ప్లేట్లు కుర్చీలు కొంత గడబిడిగా ఉంది.
పనివాళ్ళు నిశ్శబ్దంగా అవన్నీ సర్దుతున్నారు.
కొంచెం ఎడంగా ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఒక యువ జంట మూడో ఆవిడకి అరవై ఏళ్లు దాకా ఉంటాయి. షాల్ కప్పుకుని కొంచెం ముడుచుకుని కూర్చుని ఉంది.
ముగ్గురు మొహాల్లోనూ విషాదం…
ఒకరి వైపు మరొకరు బేలగా చూసుకుంటూ కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ ఉన్నారు.
ఎదురుగా టీపాయ్ మీద కప్పు కింద ఉన్న కాగితాలు వాళ్లకి సానుభూతి చెప్తున్నట్లు గాలికి రెపరెపలాడుతున్నాయి.
ఆవిడ.. భాను మతి … కొడుకు సురేష్ కోడలు లత.
ఆరోజు వారి 25వ పెళ్లిరోజు ఫంక్షన్ జరిగింది.
. అప్పుడే ముందు రోజు చేయించుకున్న మాస్టర్ చెకప్ లో భానుమతి గారి భర్త శేఖర్ కి తెల్ల రక్త కణాలు లక్ష పైన ఉన్నాయని బ్లడ్ క్యాన్సర్ అవ్వవచ్చు అని రిపోర్ట్లలో వచ్చింది.
. ” రెండు రోజుల జ్వరానికే ఇలా అయిపోయిందేమిటిరా “
బావురు మంది భానుమతి.
“
“ఉండమ్మా రేపు డాక్టర్ గారితో మాట్లాడదాం. బెంబేలు పడిపోకు నువ్వు వెళ్లి పడుకో…”
అంటూ భార్యకి సైగ చేశాడు. లత అత్తగారిని లోపలికి తీసుకుపోయింది.
*. *. *
పక్క మీద కొంచెం నీరసంగా ఉన్న మొహంతో అమాయకంగా నిద్రపోతున్న భర్తను చూసి నిట్టూర్చింది భానుమతి.
“
*. *. . …
. ఏమన్నారు రా డాక్టర్ గారు తల వాల్చుకుని వచ్చిన సురేష్ ని బట్టి కుదుపుతూ అడిగింది ఆవిడ.
. బ్లడ్ క్యాన్సరే అన్నారు అమ్మా.. సాయంత్రం సూపర్ స్పెషలిస్టులు ముగ్గురు కూర్చుని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తానన్నారు. నాలుగో దశ అంటున్నారు….
అప్పుడే స్నేహితురాలి ఇంటికి వెళ్లిన లత
కొంచెం ఉద్విగ్నంగా “అత్తయ్యా “అంటూ లోపలికి అడుగు పెట్టింది….
. భర్తని చూస్తూ ఓ మీరూ ఇక్కడే ఉన్నారా? మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి . ఇప్పటి ప్రాబ్లంకి సంబంధించింది జాగ్రత్తగా వినండి” అంది.
. అత్తయ్యా ..
మీకు జ్ఞాపకం….వుందా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య కామాక్షి గారు….
పోయిన ఉగాదినాడు… కైలాస గౌరీ వ్రతం చేసుకున్నారు….. మనం ఇద్దరమూ కూడా వెళ్లి పసుపు కుంకుమలు తెచ్చుకున్నాము….
“అవునూ…అయితే ..” ఇప్పుడు ఈ సోది ఎందుకు అన్నట్టు చూసారావిడ.
“ఆ వ్రతం ఆవిడ వాళ్ళ ఆయన ఆరోగ్యం కోసం చేశారు. అసలు ఆ వ్ర తమే సౌభాగ్యం కోసమట”
“ఆయనకి కూడా క్యాన్సరే.. అయిన వాళ్ళని పిలిపించండి ఇంకా వారాల్లోనో,రోజుల్లోనో అని డాక్టర్లు చెప్పారు.
అదిగో అప్పుడే…
ఆవిడ ఈ నోము నోచారు.
ఆయన ఇంకా ఉన్నారు.
అత్తయ్యా .. మీరూ ఆ వ్రతం చేయొచ్చు కదా “ఆర్తిగా అడిగింది లత.
భానుమతిలో ఆశ చిగురించింది.
“రేపు వాళ్ళ ఇంటికి వెళ్లి వివరాలు కనుక్కుని వస్తాను… ఆవిడ నాకు పరిచయమే కదా” అంది.
*. *. *
మర్నాడు భానుమతి గారు వెళ్లేసరికి కామాక్షి ఎక్కడికో బయటకు వెళ్ళటానికి తయారైనట్టున్నారు.
జానెడు జరీ అంచు పట్టుచీర.
పెద్ద కుంకుమ బొట్టు. కళ్ళనిండా కాటుక.
. మెడలో చిన్న నెక్లెస్ పొడుగు కాసులపేరు…
ముడి చుట్టూ విరిసీ విరియని గులాబీ పువ్వులు.
చాలా కళకళలాడుతూ ఉన్నారు…
“భాను… రండి.. రండి.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి” అంటూ
ఆహ్వానించారు భాను మతిని
“…. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సంకోచించింది.. భానుమతి
” ఏం లేదండి పక్కింటి అమ్మాయిపెళ్లి.*పెద్ద ముత్తైదువ* మీరు రండి ముహూర్తానికి అన్నారు..”..కించి గర్వం లాంటిది ఆవిడ గొంతులో కళ్ళల్లో…
. “అరే అలాగా మీరు వెళ్ళండి నేను కూర్చుంటాను లెండి. ఇంట్లో మీ కోడలు ఉంది కదా.,..”
“ఒక్క క్షణంలో .. ముహూర్తానికి అక్షింతలు వేసి వచ్చేస్తాను…”
. మొహమాటపడుతూనే గేటు వైపు కదిలారు ఆవిడ..
” ఓ అత్తయ్య గారు..
రండి అంటూ ఎదురొచ్చింది కామాక్షి కోడలు…”
“బావున్నావామ్మా మీ మామగారు ఎక్కడున్నారు. “.
“లోపల ఉన్నారు రండి”
లోపలకి అడుగు పెట్టబోతు ఒక్క సారిగా షాక్ కొట్టినట్టు ఉండిపోయింది.
కింగ్ సైజ్ బెడ్ మధ్యలో సన్నగా పుల్లలా ఒక ఆకారం
రెండు చేతులకి ఏవో సూదులు, బాటిల్స్
గొంతులోకి ఒక గొట్టం,
ఆక్సిజన్ అనుకుంటాను ముక్కులో..
వెనకే వస్తున్న కామాక్షి కోడలు..
“ఏంటో నండి అనకూడదు కానీ ఆయనకి నరకం…. చూసేవారికి నరకం….. అలా పేరుకి మాత్రమే శ్వాస ఆడుతోంది. మనిషి అసలు మన లోకంలో ఉన్నట్టు లేరు…” కనీ కనిపించని విసుగు ఆ అమ్మాయి గొంతులో ..,
“రండి…. హాల్లో.. కూర్చుందాం” అంటూ హాల్లోకి దారి తీసింది.
భానుమతికి మనసంతా కకా వికలం అయిపోయింది….
అస్సలు కూర్చో బుద్ధి కాలేదు
” లేదులేమ్మా ఇటు వేపు వెళ్తూ మామయ్య గారిని ఒకసారి చూసి పోదామని వచ్చాను. ఉంటాను” అంటూ బయటపడింది.
సురేష్ లతా బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు.
అదిగో అత్తయ్య గారు వచ్చేసారు ..అత్తయ్య గారు అడిగారా వ్రత విధానం విధానం..
మనం ఎప్పుడు వ్రతం చేద్దాము.అంటూ తొందర తొందరగా ప్రశ్నలు గుప్పించింది లత…
. భానుమతి ఎవరి వైపు చూడకుండా
” బాగా అలసటగా ఉంది కాసేపు పడుకుంటాను “… అంటూ లోపలికి వెళ్లి పోయారు.
. భార్యాభర్తలిద్దరూ అయోమయంగా మొహాలు. చూసుకున్నారు.
లోపల పక్క మీద పడుకుంది అన్నమాట గాని భానుమతి మనసులో ఆలోచనలు సుడులు జరుగుతున్నాయి.
. ఎంత చక్కగా ఉంది. కామాక్షి. నిండుగా హుందాగా మాటల్లో ఒక దర్పం…
తనని పెద్ద ముత్తెదుగా రమ్మన్నారు అని చెప్పటంలో ఒక చిన్న గర్వం
ఏమైనా మన సంఘంలో ముత్తైదువుకి ఉన్న స్థానమే వేరు. అందులోనూ అరవై దాటిన వాళ్ళు అంటే మరీను.
శుభకార్యాలు అన్నింటిలోనూ పెద్దపీటే….
అదే భర్త పోయిన స్త్రీకి సంఘంలో భద్రత గౌరవ రెండు తక్కువే…. తనే అత్తగారింట్లోనూ పుట్టింట్లోనూ ఎన్నోసార్లు గమనించింది కదా! అలాంటప్పుడు మనసు చాలా చిక్కుమనేది.
. పెళ్లిళ్లలో పేరంటాలలో… తప్పుకుని తిరగాల్సి వస్తుంది.
….
అబ్బా… ఉష్…. అన్న భర్త గొంతుతో ఉలిక్కిపడి పక్కకి తిరిగింది.
. నిద్రలో చెయ్యి పైకి
వేసినట్టున్నారు అక్కడ మంచం వెనకవైపు ఉన్న చెక్కడం చేతికి తగిలింది.
. నిద్రలోనే నొప్పి బాధ ఆయన మొహం లో ….
ఒక్కసారిగా ఉలిక్కి పడింది భానుమతి.
ఎంత స్వార్ధంగా ఆలోచిస్తోంది తను…. తన వివేకం విజ్ఞత ఎక్కడికి పోయాయి.
. మనుషులను వేరు చేసే మనసులను బాధపెట్టే దురా చారాలను నిరసించే, సాధ్యమైనంతవరకు అడ్డుకునే తను ఇలా ఆలోచిస్తుంది ఏంటి….
. భర్త ఎంత సున్నితమైన వారు తనకు తెలియదా. చిన్న దెబ్బకి కూడా ఓర్చుకోలేరు. ఇంజక్షన్ తీసుకోవాలంటే తను కొడుకు సురేష్ రెండు పక్కల ఉండాల్సిందే.
. అలాంటిది ఈ రేడియేషన్లు ఈ సూదులు ఈ మందులు ఎలా ఓర్చుకుంటారో!!
పెద్ద మంచం మీద ఒక పుల్లలా పడి ఉన్న కామాక్షి భర్త కళ్ళ ముందు కదిలాడు.
ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది.
. ఆలోచనలకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకుని మెల్లిగా ధ్యానంలోకి వెళ్ళిపోయింది.
క్రమక్రమంగా మనసు తనువు రెండు తేలికైనట్లు అనిపించింది.
. “అమ్మగారు లైట్ ఏయ నా అంటూ వచ్చి గదిలో స్విచ్.. వేసి వెళ్ళింది పని పిల్ల.
*గదంతా వెలుగుపరచుకుంది*
స్థిరమైన నిర్ణయానికి వచ్చి హాయిగా నిట్టూర్చింది.
మర్నాడు ఉదయం…
హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న ఆవిడ దగ్గరికి వ వచ్చి కూర్చున్నారు లతా సురేష్.
*నేను ఈ వ్రతం చేయదలచుకోలేదు* ఖాళీ అయినా కాఫీకప్పును టేబుల్ మీద పెడుతూ అంది.
“ఏమిటీ…????సురేష్ లతా ఒకేసారి విన్నది సరైనదేనా అన్నట్టు చిన్నపాటి కేక లాగా అడిగారు.
. కొడుకు కోడళ్ళ కళ్ళలో ఆశ్చర్యం లాంటి నిరసనని గమనించి మెల్లిగా గొంతు విప్పారు..
“….. కామాకక్షి..
భర్త పేరుకే బ్రతికున్నారు. ఒంటినిండా సూదులతో గొట్టాలతో మూలగటానికి కూడా ఓపిక లేకుండా ఉన్నారు.”
“ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక *జీవచ్ఛవం”*
ఆయన బ్రతికి ఉండటం వల్ల ఆయనకి నరక బాధ తప్ప. ఎవరికీ పెద్ద తేడా ఎమ్ కనిపించటం లేదు.
ఒక్క కామాక్షి మాత్రం ముత్తైదువులా అన్ని అలంకరణలు చేసుకోగలుగుతున్నారు. సంఘంలో పెద్ద ముత్తైదువుగా గౌరవం పొందుతున్నారు.
భార్యాభర్త అన్న తర్వాత ఒకరు ముందు ఒకరు వెనకా కావటం సహజమే. అది వాళ్ళ వాళ్ళ అదృష్టం,కర్మని బట్టి ఉంటుంది.
. మీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ మీ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే…
నాకు వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా ఆ రేడియేషన్, బాధఏవేవో అనేక రకాలైన అవ లక్షణాలు వస్తాయి…
అవన్నీ ఈ య నా అనుభవించాలా “అని
. వ్రతం వల్ల లాభం ఉందా మన,సంప్రదాయం గొప్పదా మన పూజా విధానం గొప్పదా ఇవేవి నేను మాట్లాడట్లేదు…
.
డాక్టర్లకు కూడా అంతు పట్టకుండా ఒక జీవి బతుకుతుంది అని అంటే వీటి ప్రభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు.
. కానీ కేవలం నేను ముత్తైదువనిఅనిపించుకోవడానికి, మీ నాన్నని జీవచ్ఛవం చె య్యలేను….
పూడుకు పోతున్న గొంతుకుతో అతి కష్టం మీద మనసులో మాట చెప్పి,,
కొడుకు కోడళ్ళ వెర్రి చూపులు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది.
****